Disney Lay Offs: ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ బుధవారం 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది చివరలో కంపెనీకి నాయకత్వం వహించమని తిరిగి అడిగిన తర్వాత సీఈవో బాబ్ ఇగర్ తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయం ఇది. ఎంఎన్‌సీ కంపెనీలను ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజాలతోపాటు బోయింగ్ వంటి విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. వినోద రంగంలో రారాజుగా పేరొందిన వాల్ట్ డిస్నీ కూడా ఆ జాబితాలో చేరింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 7 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
Mammootty: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మలయాళ సూపర్ స్టార్…
దాదాపు 5.5 బిలియన్ల ఖర్చు ఆదా చేసుకునేందుకు, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడంలో భాగంగా 7వేల మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నామని డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ తెలిపారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 3.6 శాతం అని వెల్లడించారు. కంపెనీలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ప్రస్తుతం 7వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపారు. నష్టాలు పెరిగిపోతుండడంతో డిస్నీ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని సీఈవో బాబ్ ఇగర్ పేర్కొన్నారు. డిస్నీకి ఇటీవల సబ్‌స్రైబర్లు చాలా వరకు తగ్గిపోయారు. డిస్నీ+కి సబ్‌స్క్రైబర్‌లు డిసెంబరు 31న మూడు నెలల క్రితంతో పోలిస్తే ఒక శాతం తగ్గి 168.1 మిలియన్ కస్టమర్‌లకు పడిపోయారు. విశ్లేషకులు క్షీణతను విస్తృతంగా అంచనా వేశారు. పోస్ట్ సెషన్ ట్రేడింగ్‌లో డిస్నీ షేర్ ధర ఎనిమిది శాతం ఎక్కువగా ఉంది.
