Constable Suspended: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వేధింపులకు గురి చేస్తున్న దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా.. ఇక, కట్టుకున్న భార్యని వేధింపులకు గురిచేస్తున్న కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2018లో ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం మండవల్లి వెళ్లాడు కానిస్టేబుల్ రవి కిరణ్. అదే డ్యూటీకి వెళ్ళిన వీఆర్వో పూజిత విమలాదేవితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది.. అయితే, విమలాదేవికి అప్పటికే వివాహం కావడంతో వీరి విషయం తెలిసి విడాకులు ఇచ్చారు భర్త.. దీంతో.. 2020లో విమలాదేవిని వివాహం చేసుకున్నాడు కానిస్టేబుల్ రవి కిరణ్. కొన్ని ఏళ్లపాటు సాఫీగా సాగిన జీవితంలో ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి.. కొంతకాలంగా విమలాదేవిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడట రవికిరణ్. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవుతుండడంతో.. రవికిరణ్ వేధింపులు భరించలేక చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇక, కానిస్టేబుల్ పై కేసు నమోదు కావడంతో విషయం తెలుసుకుని సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ జాషువా.
Read Also: Bigg Boss Telugu : బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకమీదట షో లేనట్టేనా?