Disha Patani: ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ నుంచి రూ.25 లక్షలు మోసం చేసిన ఘటన సంచలనం రేపింది. జగదీష్ చంద్ర బరేలీకి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఏదో ఒక కమిషన్‌లో పెద్ద పదవి ఇప్పిస్తానని దుండగులు మోసం చేశారు. జగదీష్ పటానీ ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దుండగులు జగదీష్ పటానీకి ఫోన్ చేసి తాము ప్రభుత్వంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పినట్లు సమాచారం. మిమ్మల్ని ఏదైనా కమిషన్‌కు ఛైర్మన్ లేదా వైస్ ఛైర్మన్‌గా చేస్తామని హామీ ఇవ్వడంతో జగదీష్ పటానీ వారి ఉచ్చులో పడ్డారు. రూ.5 లక్షల నగదు, రూ.20 లక్షలను మోసగాళ్ల వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అంతే కాకుండా ప్రక్రియ కొనసాగుతోందని దుండగులు ఆయనకు హామీ ఇచ్చారు. త్వరలో మీరు శుభవార్త వింటారని ఆయనను మభ్యపెట్టారు. చాలా రోజుల ఏమీ జరగకపోవడంతో ఆయన వారిని నిలదీశారు. ఏమీ జరగకపోవడంతో, దిశా పటానీ తండ్రి దుండగులను తిరిగి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. ప్రతిగా దుండగులు కూడా అతడిని బెదిరించారు. జగదీష్ చంద్ర సదర్ కొత్వాలిలోని జునా అఖారాకు చెందిన ఆచార్యతో సహా 5 మందిపై కేసు పెట్టారు.
Read Also: Thaman : వరల్డ్ క్లాస్ మ్యూజిక్ స్కూల్ కట్టాలనేది నా కల : మ్యూజిక్ సెన్సేషన్ తమన్
పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో జగదీష్ సింగ్ పటానీ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నాకు తెలిసిన శివేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్‌లకు పరిచయం చేశారు. వారు తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ కమిషన్‌లో ఛైర్మన్, వైస్ చైర్మన్ లేదా మరొక ప్రతిష్టాత్మక పదవిని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి సమాజంలో ఏదో ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం సాధించాలనే ఆశయం ఉంటుంది. శివేంద్ర ప్రతాప్ సింగ్‌తో నాకు అప్పటికే పరిచయం ఉన్నందున, అతను ఒకప్పుడు బరేలీలో నా పొరుగువాడు. అతని అభ్యర్థనపై, నేను అతనిపై విశ్వాసంతో బరేలీలోనే రూ.5 లక్షల నగదు అడ్వాన్స్‌గా ఇచ్చాను. కొంత సమయం తరువాత, అతను లక్నోలో ఓఎస్డీ హిమాషు అని పిలవబడే వ్యక్తిని కూడా కలుసుకున్నాడు. అప్పుడు అతను పంపిన బ్యాంకు ఖాతాలకు రూ.20 లక్షలు బదిలీ చేశాను. మొత్తం రూ.25 లక్షలు ఇచ్చాను. ఆరు నెలలు గడిచినా పనులు పూర్తి చేయలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు వెనక్కి అడిగితే బెదిరించారు. పేదవాళ్లను ట్రాప్ చేసి డబ్బులు దండుకునే పనిలో పడ్డారని అప్పుడు తెలిసింది. వీరికి చాలా పెద్ద ముఠా ఉందని కూడా తేలింది.” అని జగదీష్ పటానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు ప్రజలను తమ వలలో పడవేసి ఈ విధంగా మోసం చేస్తున్నట్లు తెలిసింది. జగదీష్ పటానీ ఫిర్యాదుతో శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, ప్రీతి గార్గ్, ఆచార్య జైప్రకాష్, ఓఎస్‌డీ హిమాన్షులపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.