NTV Telugu Site icon

IPL 2025: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్‌ హాట్ భామ.. ఈసారి 13 వేదికల్లో.. !

Disha Patani Ipl 2025 Opening Ceremony

Disha Patani Ipl 2025 Opening Ceremony

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2025 ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌ ఆరంభోత్సవాన్ని బీసీసీఐ ఘనంగా నిర్వహించనుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్‌ హాట్ భామ దిశ పఠాని డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవంలో ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్‌ తన పాటలతో అభిమానులను అలరించనున్నారు. అయితే ఈసారి ఐపీఎల్‌కు ఆతిథ్యమిస్తున్న 13 వేదికల్లోనూ ఆరంభ కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రతి వేదికలో తొలి మ్యాచ్‌ సందర్భంగా.. బాలీవుడ్‌ తారలతో ప్రదర్శనలు నిర్వహించాలని భావిస్తోంది. సల్మాన్‌ ఖాన్, వరుణ్‌ ధావన్, జాన్వీ కపూర్‌, తృప్తి డిమ్రి, కత్రినా కైఫ్, అనన్య పాండే, మాధురి దీక్షిత్ వంటి బాలీవుడ్‌ తారలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. మొత్తానికి ఈ సీజన్లో బాలీవుడ్‌ భామలు సందడి చేయనున్నారు.