Site icon NTV Telugu

Disha Patani New Boyriend: ‘టైగర్’ కుళ్లుకునేలా సెల్ఫీలు.. రెచ్చిపోయిన బాలీవుడ్ భామ

Disha

Disha

Disha Patani New Boyriend: బాలీవుడ్ జంట టైగర్ ష్రాఫ్-దిశా పటానీ విడిపోయారని వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే కొత్త ప్రియుడితో క్లోజుడ్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాల్లో దిశా పటానీ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ‘టైగర్ జిందా హై?’ అంటూ ఈ పోటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో డేట్ చేసిన టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన తరువాత ఇప్పుడు దిశా కొత్త వ్యక్తితో చెట్టాలు పట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ ముంబై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

దిశా పటానీ IG కథనాలలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సదరు మోడల్ తో పోజులిచ్చి వేడెక్కించింది. అయితే దిశా జీవితంలో మిస్టరీ మ్యాన్ ఎవరు? అంటూ బోలెడంత చర్చా సాగింది. వాస్తవానికి దిశా పటానితో ఉన్న మిస్టరీ మ్యాన్ మరెవరో కాదు.. తన ఫిట్ నెస్ శిక్షకుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్. అలెక్స్ తో ఉన్న ఫోటోలే రకరకాల సందర్భాలలో సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ అయ్యాయి. దిశా – ఆమె శిక్షకుడు అలెక్స్ రెండు సార్లు కలిసి కనిపించారు. ఆ ఇద్దూ మంచి స్నేహితులు. వాస్తవానికి అలెక్స్ తన వెబ్-షో కోసం హిందీ నేర్చుకోవడంలో దిశా పటానీ సహాయం చేస్తోందని కొన్ని కథనాలొచ్చాయి. ఇక తాజాగా అలెక్స్ తో వరుస సెల్ఫీలు అంతర్జాలంలో వాడి వేడి చర్చకు తెరలేపాయి.

Exit mobile version