NTV Telugu Site icon

Disha Patani : సెర్బియన్ మోడల్ తో బాలీవుడ్ బ్యూటీ పీకల్లోతు ప్రేమ..?

dishapatani

dishapatani

బాలివుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటాని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాకా కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అవుతుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో దర్శనమిస్తూ కుర్రకారకు మత్తెక్కిస్తుంది.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

తెలుగులో లోఫర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్..పాన్ వరల్డ్ సినిమా.. కల్కీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఆమె ఏ రేంజులో ఫాలోయింగ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు మొన్నటివరకు టైగర్ షాఫ్ర్ తో డేటింగ్ చేస్తూ ఉంది.. అతనితో చెట్టా పట్టాలేసుకొని తిరిగింది.. దిశా పటానీ, టైగర్.. కొన్ని నెలల కిందట బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. బ్రేకప్ అనంతరం వారిద్దరూ మంచి స్నేహితులుగా మాత్రం మిగిలిపోయారు..

ఇకపోతే దిశ పటాని తాజాగా కొత్త బాయ్ ఫ్రెండ్ ను చూసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా మన ఇండియాన్ కాదు ఓ ఫారెన్ మేల్ మోడల్ తో చెట్టా పట్టాలేసుకునితిరుగుతుందట..సెర్బియన్ మోడల్‌, ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు గుప్పుమన్నాయి. కత్తిలా ఉండే ఈ కుర్రాడు తన ఫ్రెండ్ అని చెపుతున్నా.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి… వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..