ఈమధ్యకాలంలో నేరాలు బాగా పెరిగిపోయాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలీని పరిస్థితి. అర్థరాత్రి మహిళలు అర్థరాత్రి స్వేచ్ఛగా బయట తిరిగినప్పుడే నిజమయిన స్వాతంత్ర్యం అన్నారు. కానీ పట్టపగలే మహిళలు, యువతులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఓ తల్లీకూతురికి విచిత్రమయిన, భయానకమయిన పరిస్థితి ఏర్పడింది. నడి రోడ్డుపై కారు పంక్చర్ అయింది. కారులో ఉన్నది కేవలం ఓ తల్లి, ఆమె కూతురు. చుట్టూ చిమ్మ చీకటి. కారు దిగి పంక్చర్ వేద్దామనుకున్నా బయటకు రాలేని నిస్సహాయ పరిస్థితి.
కారు డోరు తెరిచి, తెగించి దిగితే ఏమవుతుందో అనే భయం. ఏదైనా అఘాయిత్యం జరిగితే, అరిచి గీ పెట్టినా వినిపించుకునే నాధుడుండడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి? సరిగ్గా అదే చేశారు, ఆ తల్లీ, కూతురు. ఎంచక్కా దిశా యాప్ కి ఎస్.ఓ.ఎస్. కాల్ చేశారు. నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక ఆడపిల్ల దిశ యాప్ కాల్ కు స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసులకు అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Read Also: TTD Room Rents: టీటీడీ వసతి గదుల అద్దె పెంపుపై నిరసన గళం
చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళన చెందింది. వెంటనే తేరుకుని దిశా యాప్ SOS కాల్ చేసింది. కేవలం 10 నిముషాలలో పోలీసులు వారి వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించారు చిన మర్రిపాడు పోలీసులు. ఆమె కారు టైర్ మార్పించి, సురక్షితంగా గమ్యం చేరేలా సహకరించారు. ఎపి పోలీసుల సేవలు సలాం అంటూ ఆ తల్లి, కూతుళ్ళు మర్రిపాడు పోలీసులకు కృతజ్ణ్నతలు తెలిపారు.
Read Also: Delhi: ఆప్‌కు భారీ షాక్.. 10 రోజుల్లో రూ.163.62 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..