NTV Telugu Site icon

Chayote Health Benefits: సీమ వంకాయ గురించి విన్నారా.. తింటే ఇన్ని లాభాలా?

Chayote

Chayote

Chayote Health Benefits: మన దేశంలో చాలామంది రోజు వారి ఆహారంగా అన్నం, కూరగాయలు, చేపలు, మాంసం వంటి వంటకాలను ముఖ్యంగా తీసుకుంటారు. కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారుతున్నా, పాత పద్ధతులు, ప్రత్యేకమైన ఆహార సంస్కృతి మాత్రం ఇప్పటికీ నిలిచింది. బియ్యం, కూరగాయలు వంటి వంటకాల రుచి మార్పులు చెందుతున్నా, ప్రాథమిక రుచి మాత్రం అలాగే ఉంటుంది. ఇలాంటి వాటిలోనే “సీమ వంకాయ” లేదా బెంగళూరు వంకాయ ఒకటి. ఇది మన మార్కెట్లో సాధారణంగా కనిపించే కూరగాయలలో ఒకటి. గతంలో సీమ వంకాయ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే, తాజాగా రకరకాల కొత్త రుచుల్లో సీమ వంకాయ కూడా చేరిపోయింది. ఈ కూరగాయకు ప్రత్యేకమైన రుచి ఉండటంతో పాటు, పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ చాలా మంది సీమ వంకాయ ఉపయోగం గురించి అవగాహన లేకుండా ఉంటున్నారు. ఒకవేళ ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే, సీమ వంకాయను తప్పకగా కొనుగోలు చేసి తమ ఆహారంలో భాగం చేసుకుంటారు.

Also Read: Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఎందుకు ఆర్థిక వేత్త కావాలనుకున్నారు? ఆయన మాటల్లోనే..

సీమ వంకాయ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన ఆహారం. అధిక పీచుతో కూడిన ఈ కూరగాయ, పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.అలాగే ఇందులో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కూరగాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలతో నిండినదిగా ఉంటుంది. ఈ పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక అలాగే అధిక ఫైబర్ ఉండడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Lava Yuva 2 5G: చెప్పిన తేదీకి ముందే మార్కెట్‌లోకి వచ్చేసిన లావా స్మార్ట్ ఫోన్

ఈ కూరగాయలో ఫ్లావనాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ముక్కలుగా ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి కేన్సర్ వంటి రోగాల నుండి రక్షణ కల్పిస్తాయి. అలాగే యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి అవసరమైన పోషణ అందించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఫోలేట్ ఎక్కువగా ఉండడం వలన, ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శిశువు మేధస్సు, నాడీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడంతో, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ బాధితులకు అనుకూలమైన ఆహారం. ఇందులో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక శాంతిని కలిగిస్తుంది. విటమిన్ K, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో, ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.