వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది.. కొండ దంపతులకు ఎమ్మెల్యేలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాలతో రెండు వర్గాలు ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రేపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు గాంధీ భవనకు వచ్చి కలవాలంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి కోరారు.. క్రమశిక్షణ కమిటీ సూచనల మేరకు రేపు హైదరాబాద్ వెళుతున్న వరంగల్ జిల్లా నేతలు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నే ప్రతిపాదించబోతున్నారు. క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ బస్వవరాజు సారయ్య ధీమ వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: ENG vs IND: నువ్వు ఎక్కడికో వెళ్లిపోవాలి.. ప్రిన్స్‌ను మెచ్చుకున్న కింగ్!
కాగా.. ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఇప్పుడు వీధి కెక్కింది. వాళ్ళంతా.. క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు. కమిటీ ముందుకు వచ్చారు. వివరణలు ఇచ్చుకున్నారు గానీ.. సీన్‌లో మాత్రం మార్పు లేదు. దేని దారి దానిదే అన్నట్టుగా ఉంది వ్యవహారం. జిల్లా శాసనసభ్యులందరిమీద రాసిన ఆరు పేజీల లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ బయటకు రావడంతో… అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మరుసటి రోజే… ఆయన వ్యతిరేకవర్గం అంతా ఓరుగల్లులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి… పార్టీకి డెడ్ లైన్ పెట్టింది. జులై 5 లోపు మురళి మీద చర్యలు తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చింది. దీంతో వ్యవహారం మరింత సీరియస్‌గా మారిపోయింది. అయితే కాంగ్రెస్ నాయకత్వం అలాంటి చర్యలకు సిద్ధంగా ఉందా..? సొంత పార్టీ నేతలే… కొండా ఫ్యామిలీ కావాలా…మేం కావాలో తేల్చుకోండని పెట్టిన గడువును రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్. ఈ క్రమంలో అధిష్టానం ఏం చేయబోతోందా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
READ MORE: Viral Video: ఇదేందయ్యా ఇది.. ఎప్పుడు చూడలే.. ఏటీఎంలో ఏసీ, సీసీటీవీకి తాళాలు..!
