Site icon NTV Telugu

2018 Movie : 2018 మూవీకి నిరాశ..ఆస్కార్ రేసు నుంచి ఔట్..

Whatsapp Image 2023 12 22 At 4.20.02 Pm

Whatsapp Image 2023 12 22 At 4.20.02 Pm

ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన మలయాళ మూవీ 2018కు నిరాశే మిగిలింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీలో ఆస్కార్స్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఈ మలయాళ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.96వ ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన పదిహేను సినిమాలు జాబితాను అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ తాజాగా అనౌన్స్ చేసింది. అందులో 2018 మూవీ పేరు కనిపించలేదు.2018 మూవీ ఆస్కార్‌కు షార్ట్ కాలేకపోయిన విషయాన్ని మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.ఈ లిస్ట్‌లో 2018 మూవీ లేకపోవడం బాధను కలిగించిందని జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెలిపారు.. ఆస్కార్‌కు 2018 నామినేట్ అవుతుందని ఎదురుచూసిన చాలా మంది ప్రేక్షకులను నిరాశపరిచానని, వారందరికి క్షమాపణలు చెబుతున్నట్లు జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

దేశంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలవడం అలాగే దేశం తరఫున అఫీషియల్‌గా ఆస్కార్ ఎంట్రీని దక్కించుకోవడం అన్నది ఏ ఫిల్మ్ మేకర్ కెరీర్‌లోనైనా అరుదైన ఘనతగా చెప్పవచ్చు. జీవితం ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని 2018 మూవీ నాకు మిగిల్చింది అని జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి పోస్ట్ వైరల్‌గా మారింది. 2018 లో సంభవించిన కేరళ వరద విపత్తు నేపథ్యంలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ మూవీ ని తెరకెక్కించాడు. టోవినో థామస్‌, కుంచకోబోబన్‌, వినీత్ శ్రీనివాసన్‌ మరియు అపర్ణ బాలమురళి 2018 మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మలయాళ మూవీ ఏకంగా 177 కోట్ల వసూళ్లను రాబట్టింది.మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా 2018 నిలిచింది.కాని ఈ మూవీ ఆస్కార్ రేసు వరకు వెళ్లిందంటే మాములు విషయం కాదు చాలా గ్రేట్ అంటూ నెటిజన్స్ ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Exit mobile version