2018 Movie : 2018 మూవీకి నిరాశ..ఆస్కార్ రేసు నుంచి ఔట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన మలయాళ మూవీ 2018కు నిరాశే మిగిలింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీలో ఆస్కార్స్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఈ మలయాళ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.96వ ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన పదిహేను సినిమాలు జాబితాను అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ తాజాగా అనౌన్స్ చేసింది. అందులో 2018 మూవీ పేరు కనిపించలేదు.2018 మూవీ ఆస్కార్‌కు షార్ట్ కాలేకపోయిన విషయాన్ని మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.ఈ లిస్ట్‌లో 2018 మూవీ లేకపోవడం బాధను కలిగించిందని జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెలిపారు.. ఆస్కార్‌కు 2018 నామినేట్ అవుతుందని ఎదురుచూసిన చాలా మంది ప్రేక్షకులను నిరాశపరిచానని, వారందరికి క్షమాపణలు చెబుతున్నట్లు జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
దేశంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలవడం అలాగే దేశం తరఫున అఫీషియల్‌గా ఆస్కార్ ఎంట్రీని దక్కించుకోవడం అన్నది ఏ ఫిల్మ్ మేకర్ కెరీర్‌లోనైనా అరుదైన ఘనతగా చెప్పవచ్చు. జీవితం ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని 2018 మూవీ నాకు మిగిల్చింది అని జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి పోస్ట్ వైరల్‌గా మారింది. 2018 లో సంభవించిన కేరళ వరద విపత్తు నేపథ్యంలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ మూవీ ని తెరకెక్కించాడు. టోవినో థామస్, కుంచకోబోబన్, వినీత్ శ్రీనివాసన్ మరియు అపర్ణ బాలమురళి 2018 మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మలయాళ మూవీ ఏకంగా 177 కోట్ల వసూళ్లను రాబట్టింది.మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా 2018 నిలిచింది.కాని ఈ మూవీ ఆస్కార్ రేసు వరకు వెళ్లిందంటే మాములు విషయం కాదు చాలా గ్రేట్ అంటూ నెటిజన్స్ ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
Also Read
- Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
- Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
- BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
- Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!