Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్!

Tfda Meets Telangana Cm

Tfda Meets Telangana Cm

TFDA meets Telangana CM Revanth Reddy: ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్‌ను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించబోతోంది. ఈ వేడుక రావాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ శుక్రవారం (మే 17) సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు.

Also Read: Sonakshi Sinha: అందుకే మనీషా కొయిరాలకు సారీ చెప్పా!

డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్‌ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పినట్లు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, ప్రపంచ సినిమాకు టాలీవుడ్ హబ్‌గా మారేలా చేద్దామని సీఎం చెప్పినట్లు టీఎఫ్‌డీఏ అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. వీర శంకర్ మాట్లాడుతూ… ‘శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వశిష్ట కలిశాం. ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరితే.. సుమారు గంట సేపు మాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం గారి విజన్‌కు ఆశ్చర్యం వేసింది. ప్రపంచ సినిమా హబ్‌గా టాలీవుడ్ మారాలని, ఆ దిశగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాం. డైరెక్టర్స్ డేను ప్రపంచమంతా గుర్తుపెట్టుకునేలా ఈ ఈవెంట్ చేస్తున్నాం. సీఎం తప్పకుండా వస్తామని మాటిచ్చారు’ అని చెప్పారు.

 

Exit mobile version