Site icon NTV Telugu

Game Changer: ‘గేమ్ ఛేంజర్’కు ఆ అవకాశం లేదు: శంకర్

Gamechanger

Gamechanger

Game Changer Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, డైరెక్టర్ ఎస్ శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ చిత్రీకరణ తుది దశలో ఉంది. అయితే ఈ చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా డైరెక్టర్ శంకర్‌ స్వయంగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. భారతీయుడు 2 ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో గేమ్ ఛేంజర్‌ గురించి శంకర్‌ మాట్లాడారు.

‘గేమ్ ఛేంజర్ చిత్రంకు సంబంధించి మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. భారతీయుడు 2 విడుదలైన వెంటనే షూటింగ్ మొదలెడతాం. గేమ్ ఛేంజర్, భారతీయుడు చిత్రాలకు అస్సలు పోలికే లేదు. భారతీయుడుకి పార్ట్ 3 కూడా ఉంటుంది. గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం రెండో భాగం ఉండదు. గేమ్ ఛేంజర్ స్టోరీకి స్కోప్ లేదు’ అని డైరెక్టర్ ఎస్ శంకర్‌ చెప్పారు. శంకర్‌ తీసిన రోబో, భారతీయుడు చిత్రాలకు సీక్వెల్ ఉన్నాయి. ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ చిత్రాలకు సమయం వచ్చినపుడు సీక్వెల్‌ తీస్తానని శంకర్‌ పేర్కొన్నారు.

Also Read: Rashmika Mandanna: మరోసారి సీమ యాస, ఆహార్యంతో సందడి చేయనున్న రష్మిక మందన్న!

గేమ్ ఛేంజర్ చిత్రంకు సంబందించి రామ్ చరణ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కరోనా టైంలో ప్రకటన వచ్చిన ఈ చిత్రం.. దీపావళికి థియేటర్లలోకి రానుందని అంటున్నారు. ఇది మిస్సయితే క్రిస్మస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌జె సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version