Site icon NTV Telugu

Bharateeyudu 2: భారతీయుడు సీక్వెల్‌ అవసరమా అనుకున్నా: శంకర్‌

Director S Shankar

Director S Shankar

Director S Shankar React on Bharateeyudu 2 Sequel: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా, డైరెక్టర్ శంకర్‌ కలయికలో వస్తున్న సినిమా ‘భారతీయుడు 2’. 28 ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రంకు ఇది సీక్వెల్‌. భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పార్ట్‌ 2 రూపొందించేందుకు ఇంత గ్యాప్‌ ఎందుకు వచ్చిందో శంకర్‌ తెలిపారు.

Also Read: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్‌!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ మాట్లాడుతూ… ‘భారతీయుడు తర్వాత వేరే సినిమాలతో బిజీ అయ్యా. పత్రికల్లో, టీవీల్లో లంచం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మళ్లీ భారతీయుడు వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అయితే చెప్పాలనుకున్న విషయాన్ని భారతీయుడులోనే చెప్పేశాం కదా.. సీక్వెల్‌ అవసరమా అనుకున్నా. ఆ ఆలోచనతోనే సంవత్సరాలు గడిచాయి. అవినీతి ఇంకా అలానే ఉందని న్యూస్‌ పేపర్లు, టీవీలు మళ్లీ గుర్తుచేశాయి. భారతీయుడు 2 తీయాలని నిర్ణయించుకున్నా. రోబో 2 పూర్తయిన తర్వాత భారతీయుడు 2 స్క్రిప్టు సిద్ధం చేశా. 2019లో సినిమాని ప్రారంభించాం. సీక్వెల్‌ తెరకెక్కించడం పెద్ద సవాలు. తొలి భాగం నేపథ్యమేంటో, పాత్రల తీరు ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి రెండో భాగం అంతకుమించి ఉండేలా జాగ్రత్త పడ్డాను. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టే పార్ట్ 2 ఉంటుంది’ అని చెప్పారు.

Exit mobile version