Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Director Ram Narayan Interview For Laila Movie

Laila: ‘లైలా’ వల్గర్ కాదు నాటీ.. క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి: డైరెక్టర్ రామ్ నారాయణ్

Published Date :February 11, 2025 , 4:45 pm
By Bhargav Chaganti
Laila: ‘లైలా’ వల్గర్ కాదు నాటీ.. క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి: డైరెక్టర్ రామ్ నారాయణ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ నారాయణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

లైలా ఐడియా ఎప్పుడు వచ్చింది ? ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ?
-బట్టల రామస్వామి బయోపిక్ సినిమా చేశాను. అది 2021లో రిలీజై మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఓ యూనిక్ కథ చేయాలనుకున్నాను. హీరో లేడి గెటప్ వేయడం యూనిక్ కాన్సెప్ట్. ఈ మధ్య అలాంటి కథలు రాలేదు. క్యారెక్టరైజేషన్ కుదిరితే అద్భుతంగా వస్తుంది. బ్యూటీపార్లర్ లో పని చేసే మేల్ క్యారెక్టర్ ని పెడితే లాజికల్ గా జస్టిఫికేషన్ వస్తుందనే ఆలోచన కథ రాయడం మొదలుపెట్టాను. ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ నాకు చాలా ఇష్టం. ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా బాగా కుదిరింది. ఇది పెర్ఫెక్ట్ ఎంటర్ టైనర్. హీరోని వెదకడం చాలా ఛాలెంజ్ గా అనిపించింది. ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి. లాస్ట్ హోప్ గా విశ్వక్ గారు ఓకే చేశారు. విశ్వక్ ఒప్పుకోవడం సాహు గారి గ్రేట్ నెస్. విశ్వక్ కి మాస్ ఇమేజ్ వుంది. కథ చెప్పినపుడు తను ఎలా తీసుకుంటారో అనే భయం వుండేది. విశ్వక్ కి ఇలాంటి లేడీ గెటప్ చేయాలని కోరిక వుండేది. ఇంతకుముందు రెండు కథలు విన్నారట. ఈ కథ ఆయనకి బాగా కనెక్ట్ అయ్యింది. విశ్వక్ రావడంతో ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.

ట్రైలర్ చూస్తే బోల్డ్ నెస్ ఎక్కువైయిందని అనిపిస్తోంది?
-ఇందులో వల్గారిటీ వుండదు. నాటీనెస్ వుంటుంది. ఈ కథకు ఆ నాటీనెస్ కావాలి. విజువల్ గా సినిమా చాలా క్లీన్ గా వుంటుంది. క్లాస్ మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది. లేడి గెటప్ అంటే మాకూ భయమే. అయితే రెమో సినిమాకి ప్రోస్తటిక్ చేసిన నిక్కీని సంప్రదించాం. విశ్వక్ లేడి గెటప్ లో అదిరిపోతారని నిక్కీ చెప్పడంతో మాకు ఇంకా నమ్మకం వచ్చింది. మేము ముందు ఎఐ లో క్రియేట్ చేసి చూసుకున్నాం. తర్వాత లుక్ టెస్ట్ చేశాం. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అవి విశ్వక్ కళ్ళు కాదని చాలమంది అనుకున్నారు. నిజానికి అవి ఆయన కళ్ళే. నా దగ్గర ఒరిజినల్ ఫొటోస్ కూడా వున్నాయి.

విశ్వక్ లో డైరెక్టర్ కూడా వున్నాడు కదా.. అది మీకు హెల్ప్ అయ్యిందా?
– ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఒక నటుడికి అన్నీ తెలిసుంటే చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్టర్ చాలా ఫ్రీ అయిపోతాడు. తన విజన్ నాకు చాలా ఇష్టం. చాలా మంచి పాజిటివ్ గా ఈ జర్నీ జరిగింది.

లైలా టైటిల్ గురించి ?
-ఇందులో సోను మోడల్ లైలా..ఈ రెండు క్యారెక్టర్స్ పై కథ నడుస్తుంది. లైలా ఈ సినిమాకి యూఎస్పీ. లైలా వచ్చిన తర్వాత స్క్రీన్ పై మ్యాజిక్ వుంటుంది. అందుకే సినిమాకి లైలా యాప్ట్ టైటిల్. లైలా గెటప్ లో విశ్వక్ చూసి వారి ఫ్యామిలీ చాలా సర్ ప్రైజ్ అయ్యారు. ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఇందులో కామాక్షి, ఆకాంక్ష, అభిమన్యు సింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో అభిమన్యు సింగ్ కామెడీని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆకాంక్ష ది జిమ్ ట్రైనర్ క్యారెక్టర్. తను మంచి డ్యాన్సర్. వారి కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది.

నిర్మాత సాహు గారి గురించి ?
-ఈ సినిమాకి సాహు గారు మెయిన్ పిల్లర్. ఆయన వలనే సినిమా ముందుకు వెళ్ళింది. కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. ఆయన ద్వారానే విశ్వక్ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. విశ్వక్ తో సినిమా చేయడం నాకు పెద్ద ఎచీవ్మెంట్.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
ప్రస్తుతం నా ఫోకస్ లైలా రిలీజ్ పైనే వుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Ram Narayan Interview
  • Laila Movie

తాజావార్తలు

  • IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

  • Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions