Director Maruthi: ‘ది రాజా సాబ్’ సినిమా గురించి దర్శకుడు మారుతీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా మీడియాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని వెల్లడించారు. తన మొదటి కాఫీ తయారీ కారణంగా చాలా అలసటగా ఉందని, అందుకే ఎక్కువగా మాట్లాడలేనని అన్నారు.
Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ..
ఈ సందర్భంగా సినిమా సెట్స్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఇది మన సెట్… ఇది మన ప్రపంచం.. ఈ సెట్స్ కోసం మేము దగ్గర్లోని ఇంట్లో దాదాపు ఏడాదిన్నర పాటు నివసించాం. ఇప్పుడు ఆ కష్టం మొత్తం సినిమాగా బయటకు వచ్చింది అంటూ తన అనుభూతిని పంచుకున్నారు. ‘ది రాజా సాబ్’ ఒక హారర్ ఫాంటసీ సినిమా అని, అయితే అందులో భయానికే పరిమితం కాకుండా రొమాంటిక్ సన్నివేశాలు, హీరో పాత్రల డిజైన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మారుతీ తెలిపారు.
Yash Toxic Teaser: యష్ ఫ్యాన్స్.. ‘టాక్సిక్’ సర్‌ప్రైజ్‌కు రడీగా ఉన్నారా!
మీడియాను ఉద్దేశించి.. “మీకు ఈ సెట్ నచ్చిందా? ఫోటోలు తీసుకున్నారా?” అంటూ సరదాగా అడిగిన మారుతీ, అందరూ ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పిన ఆయన, “ఇప్పుడు నా పని మాట్లాడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన పీఆర్ టీమ్‌కు, తెలుగు మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రీమియర్ షోల గురించి ప్రస్తావిస్తూ.. సినిమా ప్రేక్షకులందరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. చివరగా “మనమందరం ఈ ప్రయాణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నాం” అంటూ మారుతీ తన మాటలను ముగించారు.
