NTV Telugu Site icon

Lokesh Kanagaraj : మరో క్రేజీ హీరోతో లోకేష్ కనగరాజ్

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj : సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు లోకేష్. ఈ యువ దర్శకుడు తీసిన సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా కథకి మరో సినిమా కథకి లింక్ పెట్టి సినిమాలు తీస్తున్నాడు లోకేష్. దళపతి విజయ్‌ నటించిన కత్తి, మాస్టర్‌, లియో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లియో సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తలపతి విజయ్ తో గోట్ సినిమా తీశాడు. ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, టైటిల్ టీజర్ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి.

Read Also:Russia President: ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం..

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమాలు అంటే మాస్ ఆడియెన్స్ కు పండుగే. తన సినిమాలపై ఓ రేంజ్ లో ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే లోకేష్ నుంచి ప్రస్తుతం కూలీ, విక్రమ్ 2, రోలెక్స్, ఖైదీ 2, లియో 2 ఇలా తన సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్నవి లేనివి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ కలయిక కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి అది కూడా యంగ్ హీరో శివ కార్తికేయన్ తో అట. తన దగ్గర ఆల్రెడీ శివ కార్తికేయన్ కోసం ఓ మంచి స్క్రిప్ట్ సిద్ధం గానే ఉందని తమ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడైనా మొదలు కావచ్చని సమాచారం. దీనితో లోకేష్ కనగరాజ్ నుంచి భవిష్యత్తులో కొన్నేళ్ల వరకు నాన్ స్టాప్ సినిమాలు రానున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్న “కూలీ” షూటింగులో తాను బిజీగా ఉన్నాడు.
Read Also:IND vs NZ: బాబోయ్ మళ్లీ వచ్చేశాడు.. నిలిచిన బెంగళూరు టెస్టు! 12 పరుగుల వెనుకంజలో భారత్

Show comments