NTV Telugu Site icon

Hari Hara Veera Mallu: డైరెక్టర్ క్రిష్‌ని తప్పించలేదు.. తప్పుకున్నాడు!

Director Krish

Director Krish

Director Krish left from Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్‌ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక కాగా.. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. హరిహర వీరమల్లును మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసినా.. షూటింగ్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు యాక్టివ్ అయింది.

హరిహర వీరమల్లు నుంచి ఇటీవలి రోజుల్లో వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అప్డేట్స్ ఇస్తున్నారు. నేడు టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లలో డైరెక్టర్ క్రిష్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. హరిహర వీరమల్లు నుంచి క్రిష్‌ని తప్పించారు అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. క్రిష్‌ని తప్పించలేదు, అతడే స్వయంగా తప్పుకున్నాడని చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ సందర్భంగా తెలిపింది. క్రిష్ వేరే సినిమాతో బిజీగా ఉండడంతో.. ఆయన పర్యవేక్షణలో ఈ సినిమా నిర్మాత ఏఎమ్‌ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ పేర్లలో క్రిష్ సహా జ్యోతి కృష్ణ పేరు కూడా ఉంది.

Also Read: Uma Ramanan Dies: ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూత!

జ్యోతి కృష్ణ రచయిత, దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఎనక్కు 20 ఉనక్కు 18, నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ లాంటి పలు సినిమాలని తెరకెక్కించారు. కొన్ని సినిమాలకు ఆయన రచయితగా కూడా పనిచేశారు. హరిహర వీరమల్లు సినిమాను 2024 చివర్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Show comments