Harish Shankar on Ustaad Bhagat Singh: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఒకరు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌పై హరీశ్ తన అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా మరోసారి పవన్‌పై అభిమానం చూపారు. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. కట్టె కాలేవరకు ఆయనకు ఫ్యాన్‌గానే ఉంటాడు అని చెప్పారు. ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయడం గర్వంగా ఉందని హరీశ్ శంకర్ చెప్పారు.
మాస్ రాజ్ రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈనేపథ్యంలో హరీశ్ వరుస ప్రచారాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘ఇటీవలే పవన్ కల్యాణ్‌ను కలిశాను. సినిమాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. త్వరలోనే సినిమా స్టార్ట్ చేస్తాం. పవన్ లీడర్ కాకముందు నుంచే నేను ఆయన్ని ఆ స్థాయిలోనే ఊహించుకున్నా. ఆయన గెలవకముందే ‘గాజు పగిలేకొద్దీ పదునెక్కువ’ డైలాగు రాశాను. ఆ డైలాగు సీఎం చంద్రబాబు గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
Also Read: Serena Williams-Restaurant: పారిస్ రెస్టరెంట్‌లో సెరెనాకు అవమానం.. వివరణ ఇచ్చిన మేనేజ్‌మెంట్!
‘పవన్ కల్యాణ్ పదవిని ఎంజాయ్ చేయట్లేదు. ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజల్లో మమేకం అవుతున్నారు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయడం గర్వంగా ఉంది. పవన్‌కు ఎందరో అభిమానులు ఉన్నారు. ఒక్కసారి పవన్ కల్యాణ్ అభిమాని అయితే కట్టె కాలేవరకు ఆయనకు ఫ్యాన్‌గానే ఉంటాడు’ అని హరీశ్ శంకర్ చెప్పారు. పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హరీశ్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమా షూటింగ్స్ పక్కనపెట్టారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేయాల్సి ఉంది. ఓజీ, హరిహర వీరమల్లు చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఉస్తాద్ షూటింగ్ 20 శాతం పూర్తయింది.