NTV Telugu Site icon

Harom Hara Movie: క్లైమాక్స్‌ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!

Haromhara

Haromhara

Gnanasagar Dwaraka on Harom Hara Movie Climax: సుధీర్‌ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్‌ జీ నాయుడు నిర్మించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇప్పటికే హరోం హర నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచాయి. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం రాత్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జ్ఞానసాగర్‌ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

హరోం హర క్లైమాక్స్‌ మతి పోయేలా ఉంటుందని దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక తెలిపారు. ‘ఈ సినిమాలో సుధీర్‌ బాబు అద్భుతంగా నటించారు. ఆయనలో ఓ స్వాగ్‌ ఉంటుంది. అది హరోం హరలో చక్కగా బయటకొచ్చింది. కుప్పం యాసలో సుధీర్‌ పలికే సంభాషణలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. సినిమా బాగా వచ్చింది. సినిమా క్లైమాక్స్‌ మతి పోయేలా ఉంటుంది. తప్పకుండా సుధీర్‌ నుంచి ఊహించని సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని జ్ఞానసాగర్‌ అన్నారు.

Also Red: Kalki 2898 AD: కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!

‘నా మొదటి చిత్రం సెహరి చూసి సుధీర్‌ బాబు సతీమణి ఆయనకు నా గురించి చెప్పారట. కథ వినిపించగానే.. తొలి సిట్టింగ్‌లోనే ఒకే చెప్పారు. మనం సినిమా చేద్దామన్నారు. అలా హరోం హర పట్టాలెక్కింది. ఇందులో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో సుధీర్‌ నటించారు. కుప్పంలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పని చేసే ఓ వ్యక్తి.. తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టి పవర్‌ఫుల్‌ సుబ్రహ్మణ్యగా ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరంగా చూపించాం. సినిమాలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంటుంది’ అని దర్శకుడు జ్ఞానసాగర్‌ చెప్పారు.