Site icon NTV Telugu

Sai Pallavi: “లేడీ పవర్ స్టార్” సాయి పల్లవికి అనారోగ్యం..

Sai Pallavi

Sai Pallavi

నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతున్నాయి. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ కూడా విడుదలైంది. హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం ముంబైలో జరిగింది. బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

READ MORE: Premistava Movie Review: ప్రేమిస్తావా మూవీ రివ్యూ

కాగా.. ఈ ఈవెంట్‌కు హీరోయిన్ “లేడీ పవర్ స్టార్” సాయి పల్లవి హాజరుకాలేదు. ఆమె అనారోగ్యానికి గురైనట్లు దర్శకుడు చందు మొండేటి తెలిపారు. సాయిపల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా.. సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అనారోగ్యంతో అలాగే కార్యక్రమాలకు హాజరు కావడంతో మరింత నీరసించినట్లు చెప్పారు. సాయిపల్లవికి కనీసం రెండు రోజుల పాటు బెడ్‌ రెస్ట్‌ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. అందుకే ఆమె హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరు కాలేదని చందు మొండేటి స్పష్టం చేశారు.

READ MORE: Janhvi Kapoor : కండోమ్ యాడ్‌కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ ఛాయిస్.. ప్రముఖ వ్యాపారవేత్త వైరల్ కామెంట్

Exit mobile version