NTV Telugu Site icon

Anil Ravipudi: శివనాగేశ్వరరావు స్టైల్ లో ‘దోచేవారెవరురా’!

Anil Ravipudi

Anil Ravipudi

Anil Ravipudi: ‘మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం” లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు. ఈసారి ఆయన దర్శకత్వంలో నూతన నటీనటులతో బొడ్డు కోటేశ్వరరావు ‘దోచేవారెవరురా’ సినిమాను నిర్మించారు. ఈ సరికొత్త కామెడీ థ్రిల్లర్ మూవీలో అజయ్ ఘోష్‌, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్ని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాలోని ఓ పాటను ఫిల్మ్ సిటీలో సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు.

సినిమాలో ఓ ముఖ్య సందర్భంలో వచ్చే ఈ గీతాన్ని రమ్య బెహర్ పాడారు. తాజా ఇందులోని ”గుండాగాళ్లమండి…’ అనే లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా శివ నాగేశ్వరరావు గారి స్టైల్ లో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఈ చిత్రం విజయం సాధించాలని.. చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అని అన్నారు.