Site icon NTV Telugu

Mangalavaaram : మంగళవారం ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి..?

Whatsapp Image 2023 12 12 At 9.51.00 Pm

Whatsapp Image 2023 12 12 At 9.51.00 Pm

గ్లామర్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’.ఈ మూవీ ని పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బిగ్ హిట్ ఇచ్చిన అజయ్‌ భూపతినే ఈ హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కించాడు.పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్‌ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత ఆ స్థాయిలో విజయాలు లేని పాయల్‌ రాజ్‌పుత్, డైరెక్టర్‌ అజయ్‌ భూపతిలకు మంగళవారం మూవీ తో మంచి సాలిడ్‌ హిట్‌ దొరికింది. థియేటర్లలో ఎంతగానో అలరించిన మంగళవారం మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సోషల్‌ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.డిసెంబర్‌ 21 లేదా 22 తేదీల్లో మంగళవారం మూవీ ఓటీటీలోకి రానుందని, లేకపోతే డిసెంబర్‌ 25న స్ట్రీమింగ్ రానుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి మరొక కొత్త డేట్‌ వినిపిస్తోంది. మంగళవారం టైటిల్‌కు తగ్గట్టుగానే మంగళవారమే అంటే డిసెంబర్‌ 19న లేదా 26 న ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చే అవకాశముందని సమాచారం.. మరోవైపు మంగళవారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆహాలో వస్తుందని కొందరు, డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతుందని కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ అజయ్‌ భూపతి మంగళవారం మూవీ ఓటీటీ రిలీజ్‌పై వస్తోన్న వార్తలను కొట్టిపారేశాడు. త్వరలోనే అధికారిక తేదీని ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చాడు. మిస్టీరియస్‌ థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన మంగళవారం లో ప్రియదర్శి, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, అజయ్‌ ఘోష్‌, అజ్మల్‌ అమీర్‌, శ్రావణ్‌ రెడ్డి, శ్రీ తేజ్‌ మరియు తరుణ్‌ భాస్కర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కీ కాంతార ఫేమ్ అజనీష్‌ అందించిన మ్యూజిక్ మరియు బీజీఎమ్‌ మంగళవారం కు హైలెట్‌ అని చెప్పొచ్చు.

Exit mobile version