Mangalavaaram : మంగళవారం ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’.ఈ మూవీ ని పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బిగ్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతినే ఈ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయిలో విజయాలు లేని పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతిలకు మంగళవారం మూవీ తో మంచి సాలిడ్ హిట్ దొరికింది. థియేటర్లలో ఎంతగానో అలరించిన మంగళవారం మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పాయల్ రాజ్‌పుత్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.డిసెంబర్ 21 లేదా 22 తేదీల్లో మంగళవారం మూవీ ఓటీటీలోకి రానుందని, లేకపోతే డిసెంబర్ 25న స్ట్రీమింగ్ రానుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి మరొక కొత్త డేట్ వినిపిస్తోంది. మంగళవారం టైటిల్‌కు తగ్గట్టుగానే మంగళవారమే అంటే డిసెంబర్ 19న లేదా 26 న ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చే అవకాశముందని సమాచారం.. మరోవైపు మంగళవారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆహాలో వస్తుందని కొందరు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతుందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం మూవీ ఓటీటీ రిలీజ్‌పై వస్తోన్న వార్తలను కొట్టిపారేశాడు. త్వరలోనే అధికారిక తేదీని ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చాడు. మిస్టీరియస్ థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన మంగళవారం లో ప్రియదర్శి, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, అజ్మల్ అమీర్, శ్రావణ్ రెడ్డి, శ్రీ తేజ్ మరియు తరుణ్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కీ కాంతార ఫేమ్ అజనీష్ అందించిన మ్యూజిక్ మరియు బీజీఎమ్ మంగళవారం కు హైలెట్ అని చెప్పొచ్చు.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..