NTV Telugu Site icon

Bhimaa Movie: గోపీచంద్‌ పర్‌ఫార్మెన్స్‌ మరో స్థాయిలో ఉంటుంది!

Bhimaa Movie

Bhimaa Movie

టాలీవుడ్ ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న రిలీజ్ కానుంది.

సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండంతో శనివారం చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా రిలీజ్‌కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది అని పేర్కొన్నారు. పోలీస్ డ్రెస్‌లో గోపీచంద్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ‘భీమా సినిమా ఓ మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో గోపీచంద్‌ పర్‌ఫార్మెన్స్‌ మరో స్థాయిలో ఉంటుంది. సినిమాకు యాక్షన్‌ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అని దర్శకుడు ఏ హర్ష తెలిపారు.

Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?

గోలీమార్ తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా గోపీచంద్ సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతున్నాయి. మారుతి దర్శకత్వంలోని ‘పక్కా కమర్షియల్’, హిట్ డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించిన ‘రామబాణం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘భీమా’ సినిమా గోపీచంద్‌కు కీలకం కానుంది. ఈ సినిమాపై మ్యాచో స్టార్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు.

Show comments