NTV Telugu Site icon

Direct Tax Collection: బడ్జెట్ అంచనాలో రూ.10.64 లక్షల కోట్లు వసూలైన ప్రత్యక్ష పన్నులు

New Project 2023 12 15t080904.788

New Project 2023 12 15t080904.788

Direct Tax Collection: 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.4 శాతం పెరిగాయి. 2023 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొత్తం ప్రత్యక్ష పన్నులు రూ.10.64 లక్షల కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్ అంచనాలో 58.34 శాతానికి లేదా రూ.10.64 లక్షల కోట్లకు చేరాయని, గతేడాది అదే కాలంతో పోలిస్తే ఇది 23.4 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పన్నుల వసూళ్ల డేటాను విడుదల చేసింది. రీఫండ్‌లను జారీ చేయడానికి ముందు ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో స్థూల వసూళ్లు 17.7 శాతం పెరిగి రూ.12.67 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొత్తం రూ.2.03 లక్షల కోట్ల రీఫండ్ జారీ చేయబడింది. తొలిదశలో రీఫండ్‌లు ఫెయిల్ అయిన వారికి.. ప్రస్తుతం ప్రత్యేక చొరవ తీసుకున్నామని, చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతాలకు రీఫండ్‌లు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also:Cameron Green: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. 12 ఏళ్లకు మించి బతకలేనన్నారు: కామెరూన్‌ గ్రీన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను కలిపి రూ.18.23 లక్షల కోట్ల పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్ను (జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ) వసూళ్లు రూ.15.38 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో, కార్పొరేట్ ఆదాయపు పన్ను 7.13 శాతం పెరిగింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను 28.29 శాతం పెరిగింది. దీనికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను కలిపితే, మొత్తం వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 27.98 శాతం పెరిగాయి. ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 10 కోట్లు దాటిందని ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10.09 పాన్ కార్డ్ హోల్డర్లు ఆదాయపు పన్ను చెల్లించారు. అయితే, డిసెంబర్ 2వరకు, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి మొత్తం 7.76 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అంతకుముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 20 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 5 శాతం చొప్పున పెరుగుతున్నాయన్నారు.

Read Also:KCR: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. అక్కడి నుంచి ఎక్కడికి వెళతారంటే..