Site icon NTV Telugu

Dimple Hayathi: డేవిడ్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన డింపుల్.. అసలేమైందంటే?

Dimpul Heyadthi

Dimpul Heyadthi

మాస్ మహారాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలో తన గ్లామర్‌తో, నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. అలాగే డింపుల్ హయాతి‌కి డేవిడ్ అనే వ్యక్తితో గతంలోనే రహస్యంగా వివాహం జరిగింద‌ని, వారిద్దరూ చాలా కాలంగా భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నార‌ని నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. కొంతకాలం క్రితం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లిపై వస్తున్న వరుస కథనాలకు చెక్ పెడుతూ డింపుల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఒక క్లియర్‌గా వివరణ ఇచ్చారు.

Also Read : MM Keeravani: ఢిల్లీ కవాతులో కీరవాణి మ్యాజిక్.. 2500 మంది కళాకారులతో మెగా షో..

‘గత కొంతకాలంగా నాపై అనేక అబద్దపు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నాకు పెళ్లి అయిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఏ‌మాత్రం నిజం లేదు. నాకు ఇప్పటి వరకు వివాహం కాలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా విశేషాలు ఉంటే నేనే స్వయంగా అందరికీ తెలియజేస్తా‌ను దాచుకోవాల్సిన పనిలేదు. దయచేసి ఇలాంటి రూమర్ల‌ను మాత్రం సృష్టించవద్దు, నమ్మవద్దు’ అని ఆమె ఘాటుగా స్పందించారు. కేవలం డేవిడ్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించార‌ని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇక ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నానని, పెళ్లి గురించి ఆలోచించే సమయం ఇంకా రాలేద‌ని ఆమె ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో డింపుల్ హయాతి సింగిల్ అని క్లారిటీ రావడంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చు కుంటున్నారు.

Exit mobile version