టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదని, సినిమాకు ఆడియన్స్‌ను రప్పించడమే అసలైన సవాల్ అని చెప్పారు. ప్రెస్‌మీట్స్ పెట్టడం, ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో 2 గంటలకు పైగా కూర్చోబెట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. మీడియా కూడా పాజిటివ్‌గా రివ్యూలు రాస్తే సినిమాకు ఎంతో మేలు జరుగుతుందని దిల్ రాజు పేర్కొన్నారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ట్రైలర్ లాంఛ్‌లో నిర్మాత దిల్ రాజు పై వ్యాఖ్యలు చేశారు.
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రంను మధుర శ్రీధర రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డిలు నిర్మించారు. వెన్నెల కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. నేటితరం ఎదుర్కొంటున్న సంతాన లేమి సమస్య ఇతివృత్తంగా ఈ చిత్రం రాబోతోంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను దిల్ రాజు ఆవిష్కరించారు. ఆనంద్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read: Caste Expulsion: జనగామ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం.. డీసీపీ కార్యాలయంకు చేరిన పంచాయితీ!
దిల్ రాజు మాట్లాడుతూ… ‘ఇప్పుడే శ్రీధర రెడ్డి, విక్రాంత్‌తో మాట్లాడా. ఈరోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదు. ప్రెస్‌మీట్స్ పెట్టడం, ట్రైలర్స్ లాంఛ్ చేయడం గొప్పకాదు. మార్నింగ్ షోకి జనాలను తీసుకొచ్చి సక్సెస్ అనుపించుకోవడమే గొప్ప. అందుకు ఈరోజు నుంచి మీరు కష్టపడాలి. సినిమా తీసినదానికంటే ఎక్కువ శ్రమ పెట్టాలి. మీ దగ్గరనున్న కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్కు తీసుకొచ్చి.. రెండున్నర గంటలు ఎంగేజ్ చేస్తే, దానికి మీడియా వారు రివ్యూలు కాస్త పాజిటివ్‌గా రాస్తే మొదటి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇది నిజం. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.
