Family Star : ఫ్యామిలీ స్టార్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ’ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠూకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రష్మిక మందన్న కూడా ఓ పాటలో కనిపించనుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్‍లో కూడా ఆమె పాల్గొన్నారని టాక్ వినిపిస్తుంది.గీతగోవిందం మూవీ తర్వాత విజయ్ – పరశురామ్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది.. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాను వచ్చే ఏడాది (2024) సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని కొంతకాలంగా న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ విషయంపై చిత్ర నిర్మాత దిల్‍రాజు తాజాగా స్పందించారు. ఫ్యామిలీ స్టార్ మూవీ జనవరిలో రావడం లేదని ఆయన స్పష్టం చేశారు.ఫ్యామిలీ స్టార్ చిత్రం వాయిదా పడనుందని, మార్చిలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. యానిమల్ మూవీ కోసం నేడు జరిగిన మీడియా సమావేశంలో దిల్‍రాజు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సంక్రాంతి బరి నుంచి ఫ్యామిలీ స్టార్ వైదొలిగిందని దిల్‍రాజు తెలిపారు. “సంక్రాంతి రేసు నుంచి ఫ్యామిలీ స్టార్ ఔట్ అయింది. 2024 మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని దిల్‍రాజు తెలిపారు.రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా తెలుగు హక్కులను దిల్‍రాజు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ మూవీని రిలీజ్ చేశారు. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న రిలీజ్ కాగా.. తొలి రోజున తెలుగులో ఆ సినిమా రూ.14కోట్లను రాబట్టిందని దిల్‍రాజు తెలిపారు. ఈ తొలి వీకెండ్‍లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.35కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?