Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

Pradeep Ranganadhan

Pradeep Ranganadhan

కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో కూడా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన అతికొద్ది మంది హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ దాదాపు సమానమైన వసూళ్లను రాబడుతుండటం విశేషం. అయితే తనకి తెలుగు ఆడియెన్స్‌లో ఇంతటి ఆదరణ దక్కడానికి కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అని ప్రదీప్ సగర్వంగా ప్రకటించారు. తన మొదటి సినిమా ‘లవ్ టుడే’ విషయంలో దిల్ రాజు తీసుకున్న ఒక నిర్ణయం తన కెరీర్‌నే మార్చేసిందని ఆయన ఎమోషనల్ అయ్యారు.

Also Read : Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

నిజానికి ‘లవ్ టుడే’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలామంది భావించినప్పటికీ, దిల్ రాజు మాత్రం రీమేక్ వద్దు.. డబ్బింగ్ చేసి విడుదల చేద్దామనే పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లారు. ఒరిజినల్ వెర్షన్‌లోని ఫీల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు అందించడం వల్లే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ డబ్బింగ్ నిర్ణయం వల్లే ఈరోజు తెలుగు ఆడియెన్స్ తనను ఒక సొంత హీరోలా ఆదరిస్తున్నారని, ఈ క్రెడిట్ అంతా దిల్ రాజుకే దక్కుతుందని ప్రదీప్ రంగనాథన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రదీప్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులపై కూడా దిల్ రాజు గారి మార్గదర్శనం ఉండటం ఆయన మార్కెట్‌కు పెద్ద అసెట్ అని చెప్పొచ్చు.