NTV Telugu Site icon

Digvijaya Singh: కాంగ్రెస్‌ పార్టీకి నేను సర్వదా కృతజ్ఞుడను

Digvijaya Singh

Digvijaya Singh

ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ముందునుంచి అశోక్‌ గెహ్లాట్‌ అధ్యక్ష పదవికి పోటీ పడుతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌ పార్టీతనకు చాలా ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే.. ప్రస్తుతం అధ్యక్ష పదవి బరిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు శశి థరూర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయిత.. తాజాగా దిగ్విజయ్‌ సింగ్‌ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. రాహుల్ “భారత్ జోడో” యాత్ర పూర్తి అయున తర్వాత పార్టీ ఎంత శక్తివంతంగా ఉంటుందో మీరే చూస్తారు. రాజకీయాలలో నా ప్రతి ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ బలం, గాంధీ కుటుంబం మద్దతు, ప్రేమ ఉన్నాయి. అందుకు నేను సర్వదా కృతజ్ఞుడను అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా… నా పట్ల పార్టీ నేతల చాలా దయతో, ప్రేమతో అభిమానం చూపిస్తున్నారు. కృతజ్ఞతలు.. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలను సంప్రదిస్తున్నాను. ప్రతిస్పందన చాలా బాగుంది. సహజంగానే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్లిన పరిస్థితి ఉంది. “జి.23” అనేది కేవలం ఒక సృష్టి మాత్రమే. వాస్తవం కాదు. నేను పార్టీ సిధ్ధాంతాలకు ఎప్పుడూ విరుద్ధంగా ప్రవర్తించలేదు. “బాట్లా ఎన్కౌంటర్” విషయంలో నేను న్యాయ విచారణ మాత్రేమే కోరాను. అది వివాదస్పదం ఏమీ కాదు. గెలుపుపై ఆశాభావంతో ఉన్నాను అని ఆయన అన్నారు.