NTV Telugu Site icon

OG Movie : ఇమ్రాన్ హష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇది గమనించారా?

Og Poster

Og Poster

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ OG. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. మూవీలో పవన్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండటంతో చాలా ఆసక్తి ఉంది.. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు..

బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. నిన్న ఇమ్రాన్ హస్మి పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..ఫస్ట్ లుక్‍తో పాటు ఆయన క్యారెక్టర్ పేరును కూడా మూవీ టీమ్ వెల్లడించింది.. ఈ సినిమాలో ఆయన సినిమా ఓమీ బవూ అనే గ్యాంగ్‍స్టర్‌గా ఇమ్రాన్ నటించనున్నారు. లాంగ్ హెయిర్‌తో ఇంటెన్స్ లుక్‍తో ఈ పోస్టర్‌లో ఆయన ఉన్నారు. కనురెప్ప పైభాగంలో కత్తిపోటు ఉంది. స్టైలిష్‍గా పెన్ లాంటి లైటర్‌తో చుట్ట కాలుస్తూ కనిపిస్తాడు..

ఈ పోస్టర్ లో లైటర్ పై ఉన్న అక్షరాలను గమనించారా..? అందులో కనిపిస్తున్న లెటర్స్ కు అర్థం ఏంటో తెలుసా.. ఈ లైటర్‌పై జపనీస్‍లో రాసి ఉన్న పదాలకు అర్ధం ‘క్రూరమైన హైనా’ అని తెలుస్తోంది.. అంటే ఈ సినిమాలో ఇమ్రాన్ పాత్ర క్రూరమైన హైనా లా ఉంటుందని యూనిట్ హింట్ ఇచ్చేసింది.. ఇదిలా ఉండగా.. తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇమ్రాన్ హష్మి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంభీరా.. నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా.. ప్రామిస్ ఇద్దరిలో ఒక్క తలే మిగులుతుంది.. అంటూ x లో రాసుకొచ్చాడు.. ఈ సినిమాలో పవన్ పేరు గంభీరా అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. మొత్తానికి ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.. ఇక సెప్టెంబర్ 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే..

Show comments