Site icon NTV Telugu

Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?

Toxic

Toxic

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీనికి దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఆమెకు మన టాలీవుడ్‌తో కూడా ఒక పాత అనుబంధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

 ప్రముఖ టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో 2001లో వచ్చిన వీడెక్కడి మొగుడండీ సినిమాలో గీతూ మోహన్ దాస్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరో వేణు తొట్టెంపూడి కాగా, శృతి రాజ్ మెయిన్ హీరోయిన్‌గా నటించింది. గీతూ మోహన్ దాస్ ఇందులో శృతి రాజ్ చెల్లెలిగా, సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలో నటించింది. ఆ రోజుల్లో కేవలం ఒక సహాయ నటిగా కనిపించిన గీతూ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసి కేరళ రాష్ట్ర అవార్డులు అందుకున్న నటిగా మాత్రమే కాకుండా, ఆమె దర్శకత్వం వహించిన ‘లయర్స్ డైస్’ చిత్రం భారతదేశం తరపున ఆస్కార్ బరిలో నిలిచింది. ఆ తర్వాత నివిన్ పౌలీతో ఆమె తీసిన మూతోన్’  సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం యష్‌తో ఆమె తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు తెరపై చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె, ఇప్పుడు ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాను నడిపిస్తుండటం విశేషం. ఈ పాత విషయాన్ని గుర్తు చేసుకున్న నెటిజన్లు “అప్పట్లో ఈవీవీ సినిమాలో నటించిన ఈమేనా ఇప్పుడు యష్‌ను డైరెక్ట్ చేస్తోంది!” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version