అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసరిగా కంగుతింది. బాలకీర్షణ వంటి స్టార్ హీరో సినిమా ఆగడం ఏంటని చర్చ మొదలైంది. కానీ ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీ తిరగేస్తే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ రోజు ఫైనాన్స్ క్లియర్ కానీ నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడ్డయి. ఆ సినిమాలు ఏవి, ఎలాంటి అంఛానాల మధ్య రిలీజ్ పోస్టుపోన్ అయ్యాయి. చివరికి వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెసులుకుందాం …
టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రం గుర్తుండే ఉంటుంది. సెన్సెషనల్ చిత్రాల దర్శకుడు బిగోపాల్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాను చెంగల వెంకటరావ్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్ మాములు హిట్ కాదు. అప్పట్లో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ ఇష్యుస్ తో ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అయింది. అయినా కూడా తొలిరోజు రికార్డు ఓపెనింగ్ అందుకుంది. కానీ నెగిటివ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్ అయింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ పోకిరి. ఆ సినిమా తర్వాత తనకు ఒక్కడు లాంటి భారీ హిట్ ఇచ్చిన గుణశేఖర్ తో ‘ సైనికుడు’ సినిమా చేశాడు మహేష్. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా ౩౦ నవంబరు 2006 లో రిలీజ్ అయింది. అయితే రోలీజ్ రోజు ఫైనాన్సు ఇష్యు కారణంగా ఉదయం రెండు ఆటలు వాయిదా వేసి సాయంత్రం ఆటల నుండి షోస్ వేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన చిత్రం క్రాక్. లాక్ డౌన్ తర్వాత వచ్చిన థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ చిత్రానికి ఠాగూర్ మధు నిర్మాత. 2021 జనవరి 9 రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ కారణంగానే రిలీజ్ రోజు ఉదయం ఆటలు క్యాన్సిల్ అయి సాయత్రం షోస్ తో థియేటర్స్ లో అడుగుపేట్టి సూపర్ హిట్ అయింది.
