NTV Telugu Site icon

Diarrhea: కాకినాడలో డయేరియా పంజా.. ఒకరు మృతి, 50 మందికి అస్వస్థత

Kakinada

Kakinada

Diarrhea: కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతుంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు డయేరియా బారిన పడుతున్నారు. సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇక, చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. గ్రామ సచివాలయంలో పలువురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులను డీఎంహెచ్ఓ పరీశీలించారు. వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. అలాగే, నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర తినడం వలన కొందరు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్థులు చెప్తున్నారు.

Read Also: Sehwag-Shakib: సెహ్వాగ్‌ ఎవరో నాకు తెలియదు.. షకీబ్‌ అల్ హసన్ కౌంటర్‌!

ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారు అని తెలిపింది. అందులో పది మంది కోలుకున్నారు.. ఫుట్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణంగా తెలుస్తుంది.. అయితే, అధికారులు ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకి పంపించారని చెప్పుకొచ్చింది.. ఇబ్బంది ఉన్నవారిని కాకినాడ జీజీహెచ్ కి తరలించే ఏర్పాటు చేస్తున్నారు అని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు.