Site icon NTV Telugu

Diabeties Control : వారంలో 3 సార్లు తాగితే చాలు .. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది..

Diabets

Diabets

ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ షుగర్ అనేది ఒకసారి వస్తే మాత్రం జీవితాంతం పోదు.. మనిషిని లోలోపల తినేస్తుంది.. దానికి మందులు వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.. అసలు ఆ డ్రింక్ ఏంటో,ఎలా తయారు చెయ్యాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మన వంటింట్లో దొరికే వాటితోనే ఎన్నో రకాల రోగాలను నయం చెయ్యొచ్చు.. ఈరోజుల్లో షుగర్ పేషంట్స్ ఎక్కువ అవుతున్నారు.. వాళ్ళు ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి.. ఈ వ్యాధిని కంట్రోల్ లో ఉంచే సూపర్ డ్రింక్ ను ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఒక టమోటా,కీరదోశలో సగం, కాకరకాయలో సగం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి అరకప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తీసుకోవాలి. ఈ విధంగా ఈ డ్రింక్ తీసుకోవటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా వేసవికాలంలో వచ్చే డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది.. నీరసం తగ్గిపోతుంది.. ఎనర్జీ వస్తుంది..

ఇకపోతే వేసవికాలంలో, వర్షాకాలంలో అయిన డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో వచ్చే అలసట,నీరసం వంటివి కూడా తగ్గుతాయి. వర్షాకాలంలో తీసుకున్నా మంచిది.. ఈ డ్రింక్ తీసుకోవటం వలన శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోయి అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా ఉండవు… తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రింక్ ను మీరు ట్రై చెయ్యండి.. ఇప్పుడు వర్షాలకు జలుబు, గొంతు సమస్యలతో బాధ పడేవారు పుదీనా, అల్లం వేసిన టీ తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version