Site icon NTV Telugu

“Dhurandhar The Revenge” చిత్ర యూనిట్‌కు బిగ్‌ షాక్.. విడుదలైన ఫస్ట్ డేనే పాకిస్థాన్‌లో పైరసీ కాపీ ప్రత్యక్షం!

Dhurandhar The Revenge

Dhurandhar The Revenge

Dhurandhar The Revenge: దేశ వ్యాప్తంగా థియేటర్లలో ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన తొలి రోజే సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంది. ఫస్ట్‌డే భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన తొలి రోజే పైరసీ అయ్యింది. ఒక్క భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ పైరసీ కాపీని ఇంట్లోని టీవీల్లో అక్కడి జనాలు వీక్షిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. వాస్తవానికి.. ధురంధర్ సినిమాని పాకిస్థాన్ బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఫస్ట్ పార్ట్‌ను అనూహ్య రీతిలో పాకిస్థాన్ ప్రజలు వీక్షించారు. తాజాగా ‘ధురంధర్: ది రివెంజ్’ను సైతం పైరసీ చేసి వీక్షిస్తుండటం గమనార్హం. పాకిస్థాన్‌లో ‘ధురందర్: ది రివెంజ్’పై నిషేధం ఉన్నప్పటికీ.. అభిమానులు ఈ చిత్రాన్ని చూడకుండా ఆపలేకపోయింది. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

READ MORE: US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పైరసీ వెర్షన్ పాకిస్థాన్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తిగల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. పాకిస్థానీ జర్నలిస్ట్ ఖాలిద్ మెహమూద్ ఖాలిద్ తాను లాహోర్‌లో ఈ సినిమా చూస్తున్నానని పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన స్క్రీన్ క్లిప్‌ను పోస్ట్ చేస్తూ.. అతను “లాహోర్‌లో ధురందర్ 2 చూస్తున్నాను” అని రాశారు. ఇక ఈ పైరసీ అంశం చిత్ర బృదం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. పాకిస్థాన్‌లోని కొందరు ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు మార్గాలను ఎలా కనుగొంటున్నారో తెలియజేస్తూ సోషల్ మీడియా మీమ్స్‌తో నిండిపోయింది. “ధురంధర్-2 థియేటర్‌లో విడుదలైంది. పాకిస్థానీ: VPN ఆన్ కరో, VPN ఆన్ కరో” అనే మీమ్ వైరల్‌గా మారింది.

Exit mobile version