Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్‌’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!

Dhurandhar

Dhurandhar

Dhurandhar OTT Record: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్ములేపుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదలైన ధురంధర్ సినిమా.. విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం 72 గంటల్లోనే ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ సినిమాకు పదిరోజుల్లో దాదాపు 16 మిలియన్ల వ్యూస్‌ (15.9) వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా తెలిపింది.

READ ALSO: AP Crime: నా కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారు.. కాపాడండి.. హోంమంత్రికి మహిళ విజ్ఞప్తి..

థియేటర్లలో విడుదలై ఇప్పటికే సంచలనం సృష్టించిన ఒక సినిమా ఓటీటీలోను భారీ వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇది నాన్-ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చిత్రానికి ఆల్-టైమ్ రికార్డ్ స్టార్ట్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, మేకింగ్ స్టైల్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా ‘ధురంధర్’ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదలైన 72 గంటల్లోనే 7.6మిలియన్ల వ్యూస్‌తో గ్లోబల్‌ టాప్‌-10 నాన్‌ ఇంగ్లీష్‌ ఫిల్మ్స్‌ జాబితాలో నెం.1 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకూ 8.2 మిలియన్ల వ్యూస్‌ను సాధించి, ఏకంగా 11 దేశాల్లో నం.1 గా ఈ చిత్రం కొనసాగుతుండటం విశేషం. నెక్ట్స్ పార్ట్ కోసం ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ధురంధర్‌2’ సినిమాను ఐదు భాషల్లో ఒకేసారి మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ యాక్షన్, అక్షయ్ కన్నా విలనిజం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఓటీటీలో మరెన్ని రికార్డులు కొళ్లగొడుతుందో వేచిచూడాలి మరి.

READ ALSO: Mahesh Babu: గుణశేఖర్ యూఫోరియా సినిమాపై మహేష్ బాబు రివ్యూ ఇదే!