Dhurandhar : ధురంధర్ సెట్స్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన అర్జున్ రాంపాల్..!
బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రతి భారతీయుడి రక్తం మరిగించేలా ఉంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక ఎత్తు అయితే, ఎమోషనల్ సీన్స్ మరో ఎత్తు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక గుండెల్ని పిండేసే విషయాన్ని నటుడు మాధవన్ బయటపెట్టారు. సినిమా చూసి మనం ఏడవడం వేరు.. కానీ ఆ సీన్ చేస్తున్నప్పుడు నటులే సెట్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారట.
ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. కథలో బాగంగా ముంబై టెర్రర్ ఎటాక్స్ ( 26/11) నేపథ్యంలో కొన్ని సీన్స్ ఉంటాయి. అందులో ఒక సన్నివేశం ఏంటంటే.. ముంబైలో మన భారతీయులు టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోతుంటే, పాకిస్థాన్‌లో ఉన్న కొందరు వ్యక్తులు దాన్ని టీవీలో లైవ్ చూస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ సీన్ చేయాల్సింది అర్జున్ రాంపాల్.. అక్షయే ఖన్నా. నటులుగా వారు ఆ సీన్ చేయాల్సి వచ్చినా, లోపల ఉన్న భారతీయుడు మాత్రం దాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు.
Also Read
- Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం
- Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
మాధవన్ చెప్పిన దాని ప్రకారం.. ఆ సీన్ షూట్ అయిపోయిన వెంటనే అర్జున్, అక్షయే ఇద్దరూ వెక్కి వెక్కి ఏడ్చేశారట. మన దేశస్థులు అక్కడ ప్రాణాలు విడుస్తుంటే, ఇక్కడ పాకిస్థానీలుగా నవ్వుతూ సెలబ్రేట్ చేసుకోవడం అనేది వారికి నరకంలా అనిపించిందట. క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసినా సరే, ఆ క్షణం కలిగిన బాధ మాటల్లో చెప్పలేనిదని వారు ఆవేదన వ్యాక్తం చేశారు. ఒక భారతీయుడిగా ఆ సీన్ చేయడం తమకు ప్రాణం పోయినంత పనైందని వారు ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం మాధవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మన నటులకి దేశం మీద ఉన్న ప్రేమని చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ‘ధురంధర్’ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కేవలం యాక్షన్ మాత్రమే కాదు, నటీనటుల ఇలాంటి నిజమైన ఎమోషన్స్ కూడా అని అందరూ కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!