Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది… అదే ‘ధురంధర్ 2′ (Dhurandhar: The Revenge). బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల వర్షం మాత్రమే కాదు ఒక సునామీని సృష్టిస్తోంది. తెలుగు వెర్షన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అయినా కూడా ఈ సినిమా చూపిస్తున్న ‘రాంపేజ్’ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. గతంలో ‘యురి’, ‘ధురంధర్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య ధర్, ఇప్పుడు ‘ధురంధర్ 2’తో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
Also Read : Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. హిందీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు ఒక ‘ఎమోషన్’ అనిపిస్తోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ వ్యాప్తంగా తెలుగు వెర్షన్ ఊహించని రీతిలోఅదరగొడుతుంది. మారుమూల ఉండే డబ్బా థియేటర్లలో కూడా ఈ రోజు అన్ని షోలు ఫుల్స్ పడటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు నాట ఈ సినిమా సృష్టిస్తున్నది ‘అరాచకం’. సీ సెంటర్స్, డి సెంటర్స్ అనే తేడా లేకుండా ప్రతి చోటా జనం థియేటర్లకు పోటెత్తుతున్నారు. చాలా ఏరియాల్లో ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతోంది. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్, మరియు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!