Site icon NTV Telugu

Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్

Ustad

Ustad

గత గురువారం (మార్చి 19) ఉగాది కానుకగా విడుదలైన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద  తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని  సెంటర్లలో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే ఇతర చిత్రాలకు థియేటర్లు దొరకడమే కష్టంగా మారింది. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, రాయలసీమ వంటి కీలక ఏరియాల్లో ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్‌కు  ఎక్కడ చుసిన అన్ని షోలు హౌస్‌ఫుల్ అవుతుండటం విశేషం.

Also Read : NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్

ధురంధర్ 2 తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ రెండో రోజు నుంచి వసూళ్లలో భారీ పతనం కనిపిస్తోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రధాన నగరాల్లో ఉస్తాద్ బుకింగ్స్ 50% లోపు మాత్రమే నమోదవుతున్నాయి. ఒకే సమయంలో విడుదలైన ‘ధురంధర్ 2’ పై ఉన్న విపరీతమైన ఆసక్తి వల్ల, ప్రేక్షకులు ‘ఉస్తాద్’ కంటే ‘ధురంధర్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ధురంధర్ 2: ఏ మరియు బి సెంటర్లలో 75% పైగా ఆక్యుపెన్సీతో రికార్డులు సృష్టిస్తోంది. మూడో రోజు నాటికే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మిశ్రమ టాక్ రావడంతో పాటు రెండో రోజు కేవలం రూ. 9 కోట్ల నెట్ వసూళ్లతో సరిపెట్టుకుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ‘ధురంధర్ 2’ భారీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఒకవేళ ‘ఉస్తాద్’ పుంజుకోకపోతే ఈ పోటీలో ‘ధురంధర్’ ఏకపక్ష విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ధురంధర్ దాటికి ఉస్తాద్ విలవిలలాడుతోంది.

Exit mobile version