Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సునామీ.. ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి రెడీ అయ్యింది. ఫస్ట్ పార్ట్ సృష్టించిన సంచలనం తర్వాత, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ ఏడాది అతిపెద్ద చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, ఈరోజు (మార్చి 19, 2026) ఈద్ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. నిన్ననే (మార్చి 18) పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభం కావడంతో ఫ్యాన్స్‌లో సందడి మొదలైంది.
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం నటీనటులు తీసుకున్న పారితోషికాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పలు నివేదికల ప్రకారం.. ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రణవీర్ సింగ్ :
ఈ సినిమాలో రణవీర్ సింగ్ ‘హంజా అలీ’, ‘జస్కీరత్ సింగ్ రంగీ’ అనే రెండు విభిన్న పాత్రల్లో మెప్పించబోతున్నారు. ఈ చిత్రానికి ఆయనే ప్రధాన ఆకర్షణ కావడంతో, సుమారు రూ.50 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు రణవీరే అని జోరుగా ప్రచారం జరుగుతుంది.
సంజయ్ దత్ :
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్, ఈ సినిమాలో ‘చౌదరి అస్లాం’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. రణవీర్ తర్వాత అత్యధికంగా ఈయనకు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం.
ఆర్.మాధవన్ :
ఫస్ట్ పార్ట్‌లో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆర్.మాధవన్, ఈ సీక్వెల్‌లో కూడా మెరవబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన ‘అజయ్ సన్యాల్’ పాత్రలో కొనసాగుతున్నారు. ఈయన తన పాత్ర కోసం రూ.9 కోట్ల తీసుకున్నారట.
అక్షయ్ ఖన్నా:
సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో స్పెషల్ అప్పీరెన్స్‌లో కనిపించబోతున్నారు. కేవలం ఫ్లాష్ బ్యాక్ సీన్లలోనే కనిపించినప్పటికీ, తన పాత్ర ప్రాముఖ్యత దృష్ట్యా ఆయన రూ.2.5 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
సారా అర్జున్ & అర్జున్ రాంపాల్
రణవీర్ సింగ్ భార్యగా (యలీనా జమాలీ పాత్రలో) నటించిన సారా అర్జున్ ఈ చిత్రం కోసం రూ.ఒక కోటి రెమ్యూనరేషన్ తీసుకోగా, మేజర్ ఇక్బాల్‌గా కనిపించనున్న అర్జున్ రాంపాల్‌కు కూడా రూ.ఒక కోటి దక్కినట్లు టాక్. ఇతర స్టార్లతో పోలిస్తే అర్జున్ రాంపాల్ రెమ్యూనరేషన్ కాస్త తక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రికార్డులు బద్దలు కానున్నాయా..
ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం.. ‘ధురంధర్ 2’ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా. ఈద్ హాలిడే కలిసిరావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.
READ ALSO: Qatar-Iran Conflict 2026: ముదిరిన ఖతార్ – ఇరాన్ వివాదం.. ఇంధన యుద్ధం దిశగా పశ్చిమాసియా?
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!