Site icon NTV Telugu

Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!

Dhurandhar 2

Dhurandhar 2

Dhurandhar 2: ధురంధర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. గత తొమ్మిదేళ్లుగా పదిలంగా ఉన్న ‘బాహుబలి 2’ రికార్డులను ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బద్దలు కొట్టడంతో, బాహుబలి టీమ్ స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ ‘ధురంధర్ 2’ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “నిన్న ధురంధర్ 2 సినిమాను చూశాను. మూవీ పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా ఇండియా, వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీమ్‌ మొత్తానికి అభినందనలు” అని ట్వీట్ చేశారు. ఈ పోస్టును @BaahubaliMovie అధికారిక ఖాతా రీట్వీట్ చేస్తూ.. “అదిత్య ధర్ ఫిల్మ్స్, ధురంధర్ 2 టీమ్‌కు అభినందనలు. ఇండియా, USA, వరల్డ్‌వైడ్‌లో బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టి కొత్త బెంచ్‌మార్కులు సృష్టించారు” అని కొనియాడింది.

READ ALSO: Iran war: “ఇరాన్” చర్చల కోసం పాకిస్తాన్ వేదికగా కీలక పరిణామాలు..

రణ్‌వీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్ అమెరికా (USA & కెనడా)లో బాహుబలి 2 నెలకొల్పిన 9 ఏళ్ల రికార్డును తాజాగా ఈ చిత్రం తుడిచిపెట్టేసి కొత్త రికార్డ్‌‌ను నెలకొల్పింది. బాహుబలి 2 తో పాటు ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ రికార్డులను కూడా ఈ మూవీ అధిగమించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సాధించిన వసూళ్లను మించి కొత్త మైలురాళ్లను సెట్ చేసింది. మార్కెటింగ్ మాయాజాలం కంటే బలమైన స్క్రిప్ట్, అద్భుతమైన కథనమే ఈ విజయాన్ని తెచ్చిపెట్టాయని శోభు యార్లగడ్డ తన పోస్ట్‌లో విశ్లేషించారు. ఒక లెజెండరీ సినిమా టీమ్ ఇలా మరో సినిమా విజయాన్ని గౌరవించడం భారతీయ సినీ పరిశ్రమలో హెల్తీ రిలేషన్‌కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Anakapalle Movie Teaser: సమ్మర్ బరిలో ‘అనకాపల్లి’.. టీజర్ చూశారా!

Exit mobile version