Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: ధురంధర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. గత తొమ్మిదేళ్లుగా పదిలంగా ఉన్న ‘బాహుబలి 2’ రికార్డులను ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బద్దలు కొట్టడంతో, బాహుబలి టీమ్ స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ ‘ధురంధర్ 2’ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “నిన్న ధురంధర్ 2 సినిమాను చూశాను. మూవీ పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా ఇండియా, వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీమ్ మొత్తానికి అభినందనలు” అని ట్వీట్ చేశారు. ఈ పోస్టును @BaahubaliMovie అధికారిక ఖాతా రీట్వీట్ చేస్తూ.. “అదిత్య ధర్ ఫిల్మ్స్, ధురంధర్ 2 టీమ్‌కు అభినందనలు. ఇండియా, USA, వరల్డ్‌వైడ్‌లో బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టి కొత్త బెంచ్మార్కులు సృష్టించారు” అని కొనియాడింది.
READ ALSO: Iran war: “ఇరాన్” చర్చల కోసం పాకిస్తాన్ వేదికగా కీలక పరిణామాలు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
రణ్వీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్ అమెరికా (USA & కెనడా)లో బాహుబలి 2 నెలకొల్పిన 9 ఏళ్ల రికార్డును తాజాగా ఈ చిత్రం తుడిచిపెట్టేసి కొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. బాహుబలి 2 తో పాటు ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ రికార్డులను కూడా ఈ మూవీ అధిగమించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సాధించిన వసూళ్లను మించి కొత్త మైలురాళ్లను సెట్ చేసింది. మార్కెటింగ్ మాయాజాలం కంటే బలమైన స్క్రిప్ట్, అద్భుతమైన కథనమే ఈ విజయాన్ని తెచ్చిపెట్టాయని శోభు యార్లగడ్డ తన పోస్ట్‌లో విశ్లేషించారు. ఒక లెజెండరీ సినిమా టీమ్ ఇలా మరో సినిమా విజయాన్ని గౌరవించడం భారతీయ సినీ పరిశ్రమలో హెల్తీ రిలేషన్‌కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Congratulations to @AdityaDharFilms and the entire team of #Dhurandhar2TheRevenge on breaking the 9-year-old records of #Baahubali2 and setting new box office benchmarks in India, USA and worldwide! https://t.co/6UjDFKbpA4
— Baahubali (@BaahubaliMovie) March 29, 2026
READ ALSO: Anakapalle Movie Teaser: సమ్మర్ బరిలో ‘అనకాపల్లి’.. టీజర్ చూశారా!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!