Anakapalle Movie Teaser: సమ్మర్ బరిలో ‘అనకాపల్లి’.. టీజర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalle Movie Teaser: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడుతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి’ అంటూ సాగే పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో టీజర్ ఊర మాస్‌గా స్టార్ట్ అవుతుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, యూత్‌ను ఆకట్టుకునే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ కూడా ఈ టీజర్‌లో సమపాళ్లలో ఉన్నాయి.
READ ALSO: Chicken Price: చికెన్ షాపుల ముందు క్యూ కట్టిన జనాలు.. కారణం ఇదే..
Also Read
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
సాధారణంగా సినిమాలకు దర్శకత్వం వహించే త్రినాథరావు నక్కిన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. విక్రమ్ సహిదేవ్ తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ఈ ‘రా అండ్ రస్టిక్’ పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. దేవ్ జండ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మాయా.వి విజువల్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప, ఇంద్రజ, మహబూబ్ బాషా, నందిని రాయ్ వంటి నటీనటులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ సీజన్‌లోనే థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!