Dhurandhar 2: బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ధురందర్ 2’. ఈ సినిమా విడుదలైన మూడు వారాలవుతున్నా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల జోరు తగ్గకపోగా, సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ యావత్ సినీ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచేత్తుతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రముఖ స్టాండప్ కమెడియన్ జాకీర్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి.
READ ALSO: Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!
ఇటీవల జరిగిన స్క్రీన్ అవార్డ్స్ 2026 వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన జాకీర్ ఖాన్ ‘ధురందర్ 2’ సక్సెస్‌పై బాలీవుడ్ రియాక్షన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. “ఎంతమంది ఈ సినిమాపై ఇన్‌స్టా స్టోరీల్లో ప్రశంసలు కురిపించినా, ఇంటర్వ్యూల్లో ఇది నా ఫేవరెట్ మూవీ అని చెప్పినా.. అవన్నీ నిజం కావు. నిజం చెప్పాలంటే ఈ సినిమా సాధించిన భారీ విజయాన్ని చూసి బాలీవుడ్‌లో అందరికీ లోలోపల అసూయగా ఉంది” అని జాకీర్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా జాకీర్ చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమని కామెంట్స్ చేస్తున్నారు.
ఒక వైపు ఈ సినిమాపై వివాదాలు, సెటైర్లు నడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘ధురందర్ 2’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 18వ రోజున కూడా ఈ చిత్రం ఏకంగా రూ.28 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1,600 కోట్లు కొల్లగొట్టింది. కేవలం ఇండియన్ సినిమా మార్కెట్లోనే ఈ మూవీ రూ.1,013 కోట్లు సాధించింది. దీంతో అత్యంత వేగంగా ఇండియాలో రూ.1000 కోట్లు సాధించిన మూడో సినిమాగా ధురంధర్ 2 నిలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ ఫీట్‌ను ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ మాత్రమే సాధించగా, ఇప్పుడు ఆ క్లబ్‌లో ‘ధురందర్ 2’ చేరింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!
