జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న దైన్యం జగన్ రెడ్డికి కనిపించట్లేదా..?చంద్రబాబు రోడెక్కి పోరాడితే తప్ప అధికారుల్లో ఎంతోకొంత చలనం రాలేదు ?ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేసేలా రైతు పోరుబాట కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తాం.జగనన్నే మా దరిద్రమని రైతులంతా గొంతెత్తి చెప్తున్నారు.రైతులు కన్నీరు పెడుతుంటే అభినవ నీరో చక్రవర్తి తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకుంటున్నారు.హెలీకాప్టర్ దిగి రైతుల బాధలు చూసే తీరిక కూడా సీఎంకు లేదా..?
Read Also: Pakistan: జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్
ప్రభుత్వం రైతు బాధల్ని పట్టించుకోకపోగా వారిని తీవ్రంగా అవమానిస్తోంది.చంద్రబాబుని, టీడీపీని విమర్శించటం తప్ప వ్యవసాయ శాఖ మంత్రికి వేరే పనేమైనా ఉందా..?రైతుల నుంచి 40 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 5 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.50 లక్షల రైతులకు గాను కేవలం 25 లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ కట్టిన ప్రభుత్వం రైతుల్ని మభ్యపెడుతోందని తీవ్రంగా దుయ్యబట్టారు ధూళిపాళ్ల నరేంద్ర. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా కింద రబీకి డిసెంబర్ లోగా కట్టాల్సిన ప్రీమియం కట్టకుండానే తప్పుడు జీవోలతో మోసగిస్తున్నారు. అకాల వర్షాల వల్ల 5 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. జగన్ చెబుతున్న ఉచిత వ్యవసాయ బీమా పథకం ఓ బూటకం అన్నారు నరేంద్ర.
Read Also:Police Over Action: పోలీసుల ఓవరాక్షన్.. దుర్భాషలాడుతూ, చెయ్యి చేసుకొని..