నాలుగు సంవత్సరాల తర్వాత సొంత మైదానంలో మ్యాచ్.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో చెలరేగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా హాఫ్ సెంచరీ( 31బంతుల్లో 57 పరుగులు) తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే( 47) బ్యాట్ ఝులిపించాడు. కానీ.. హాఫ్ సెచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వాళ్లతో అంబటి రాయుడు( 27 నాటౌట్) ఆఖర్లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని సిక్సర్లతో చెలరేగడం అభిమానులను ఖుషీ చేశాడు. చెపాక్ స్టేడియంలో తలైవా హిట్టింగ్ ఆడటం వారిని ఆకట్టుకుంది. అంతా బాగానే ఉంది. సీఎస్కే భారీ స్కోరే సాధించింది.
Read Also : Banks Holidays : నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు
ఒక లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేయడమే అని అభిమానులు కాస్త కూల్ గానే ఉన్నారు. కానీ లక్ష్య ఛేధనకు దిగిన లక్నోకు ఓపెనర్ కైలీ మేయర్స్ అదిరిపోయే ఆరంభం అందించాడు. ధోని బౌలర్లను మారుస్తున్నా అతడలో వేగం తగ్గలేదు. పైగా తుషార్ దేశ్ పాండే, దీపక్ చహర్ వైడ్ లు, నోబాల్స్ రూపంలో చెత్త బౌలింగ్ తో ధోనితో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులకు కూడా చిరాకు తెప్పించారు. అయితే మొయిన్ అలీ అద్భుతమైన బంతితో మేయర్స్ ను ట్రాప్ చేశాడు. మేయర్స్ ఇచ్చిన క్యాచ్ ను కాన్వే ఒడిసిపట్టడంతో అతడి ఇన్నింగ్స్ కు బ్రేక్ పడింది.
Read Also : Deshamuduru: అప్పుడు జస్ట్ తెలుగు స్టార్ హీరో… ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్
దీంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. ఇక ఆ తర్వాత ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికికి చెన్నైదే పైచేయి సాధించింది. 12 పరుగుల తేడాతో ధోని సేన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు పట్ల సంతోషపడిన ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంద(తాను తప్పుకొంటానని)ని నవ్వుతూనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా పేసర్లను ఉద్దేశించి ఈ మేరకు ధోని హెచ్చరికలు జారీ చేశాడు. లక్నో ఇన్సింగ్స్ లో చెన్న బైలర్లు ఎక్స్ ట్రాల రూపంలో ఏకంగా 18 పరుగులు ఇవ్వడం.. అందులో 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉండటం ధోని అసంతృప్తికి కారణం.
Read Also : Forest officials: అటవీశాఖ అధికారులకు సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.కోటి వరకు..
మా ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది.. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో కూడా ఓ కన్నేసి ఉంచాలి.. నోబాల్స్, వైడ్స్ లాంటి ఎక్స్ ట్రాలను అస్సలు ఉపేక్షించేది లేదని ఎంఎస్ ధోని అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో తుషార్ 45 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. దీపక్ చహర్ నాలుగు ఓవర్లు వేసి 55 పరుగుల ఇచ్చాడు.
