NTV Telugu Site icon

Dhoni : వావ్.. వాట్ ఏ టాలెంట్ భయ్యా.. ధోని ఫ్యాన్స్ కు పండగే..

Dhoni

Dhoni

భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఆయనకోసం స్పెషల్ గా అందరు వస్తువులను ఇస్తుంటారు.. అందుకు భిన్నంగా ఆలోచన చేశాడు ఓ చెఫ్.. పుచ్చకాయ పై అద్భుతమైన ధోని చిత్రపటాన్ని గీసాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అంకిత్ బగియాల్ అనే కళాకారుడు ఎమ్ఎస్ ధోని చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని అద్భుతంగా చెక్కాడు. అతను పండ్లు కూరగాయాలపై రకరకాల చిత్రాలను, పెయింటింగ్ వెయ్యడం చూడొచ్చు.. ఈ వీడియోలో, అతను పుచ్చకాయపై MSD అందమైన చిత్రాన్ని రూపొందించి ప్రజలను అబ్బురపరిచాడు. కళాకారుడు పుచ్చకాయపై కెప్టెన్ కూల్ ఫేస్‌ని వాస్తవిక పద్ధతిలో చెక్కాడు..

ఇక ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చెయ్యబడింది.. అప్పటి నుంచి వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో మొదలు కావడంలో అంకిత్ తన కళకు తుది మెరుగులు దిద్దడం కనిపించింది. ఇందులో అతను పుచ్చకాయపై క్రికెటర్ ముఖాన్ని అందంగా చెక్కడం చూడొచ్చు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షించారు. కాగా పలువురు తమ అభిప్రాయాలను కామెంట్స్‌ ద్వారా తెలియజేశారు. అంకిత్‌కు ఉన్న ఈ కళను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.. ఇది చాలా అద్భుతంగా ఉండటంతో చాలా మంది వీడియోను తెగ లైక్ చేస్తున్నారు.. దాంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది..