Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: నీట్ (NEET UG) పరీక్షా పత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన చేశారు. మే 3న జరిగిన పరీక్షలో “గెస్ పేపర్లు” అనే పేరుతో అసలు ప్రశ్నపత్రమే లీక్ అయిందని ప్రభుత్వం నిర్ధారించడంతో, ఆ పరీక్షను రద్దు చేసి జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను పాటించినప్పటికీ, కమాండ్ చైన్‌లో ఎక్కడో లోపం జరిగింది. దానికి తాము బాధ్యత వహిస్తున్నామని నిజాయితీగా అంగీకరించారు. గత ఏడాది నీట్ వివాదాల నేపథ్యంలో ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరీక్షల సంస్కరణల కోసం సుమారు 95 కీలక సిఫార్సులు చేసింది. 2025, 2026 పరీక్షల కోసం ప్రభుత్వం కొన్ని రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, ఈసారి కూడా లీకేజీ జరగడం గమనార్హం. మే 7వ తేదీ నాటికే గెస్ పేపర్లలోని ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలుతున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి ఫిర్యాదులు అందాయి. ఉన్నత విద్యా శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర అధికారులతో కలిసి విచారణ జరపగా, మే 12 నాటికి పేపర్ లీక్ నిజమేనని తేలింది. ఈ నేపథ్యంలోనే నిజాయితీ గల విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ‘ఎడ్యుకేషన్ మాఫియా’ నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రధాన్ స్పష్టం చేశారు. ఇందులో ఎన్టీఏ అధికారుల ప్రమేయంపై విచారణను సీబీఐకి అప్పగించామని, ఆ సంస్థ ఈ కేసును అత్యంత పారదర్శకంగా విచారిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రీ-ఎగ్జామ్‌కు సంబంధించి ముఖ్యమైన విషయాలు..
లక్షలాది మంది విద్యార్థుల సౌకర్యార్థం జూన్ 21న జరగబోయే రీ-ఎగ్జామ్ కోసం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు ఈసారి తమకు నచ్చిన పరీక్షా కేంద్రాన్ని (City) ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. దీనికోసం విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పాత క్రెడెన్షియల్స్తోనే లాగిన్ అవ్వొచ్చు. కొత్త అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నుంచి అధికారిక ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ప్రస్తుత పేపర్-పెన్ మోడ్ కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!